
ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ.4.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాగానే ఆకట్టుకుంది. ఇక మొదటి రోజు నుంచి రెండవ రోజు మరింత కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా రూ 11.3 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా నిన్నటి రోజున దీపావళి వీకెండ్ కావడంతో చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్ పడింది. దీంతో విడుదలైన మూడు రోజులకు రూ.17.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టి కేవలం మూడు రోజులలోని బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది K.RAMP మూవీ.
ఈ చిత్రం అన్ని ఏరియాలలో కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత రాజేష్ దండా ఈ చిత్రం గురించి మొదటినుంచి చెప్పినట్టుగానే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తన సినిమాకి రమ్మని చెప్పిన అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో సూపర్ సక్సెస్ అయ్యారని ఆడియన్స్ కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి కిరణ్ అబ్బవరం మాత్రం ఈ ఏడాది కూడా మరో మంచి విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. తదుపరి విషయాల విషయానికి వస్తే త్వరలోనే క2 సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.