సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో , ఒక హీరోయిన్ కాంబోలో ఒక సినిమా వచ్చి అది మంచి విజయం సాధించి అలాగే ఆ సినిమాలో ఆ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడినట్లయితే మరో సారి ఆ కాంబోలో సినిమా రావాలి అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. ఒక వేళ అదే కాంబోలో మరోసారి సినిమా వచ్చినట్లయితే అంతకు ముందు సినిమాలో ఎలాంటి విషయాలలో ఆ జంటకు మంచి మార్కులు పడ్డాయో అలాంటి విషయాలు ఈ సినిమాలో కూడా ఉంటే బాగుంటుంది అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా కొంత కాలం క్రితం ధమాకా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరో , హీరోయిన్లుగా నటించిన రవితేజ , శ్రీ లీల జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ లో ముఖ్యంగా రవితేజ , శ్రీ లీల మధ్య మంచి డాన్స్ మూమెంట్స్ ఉండే సాంగ్స్ ను మేకర్స్ చిత్రీకరించారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది.

ఈ సినిమాలో కూడా ధమాకా మూవీ మాదిరి గానే రవితేజ , శ్రీ లీల మధ్య మాస్ స్టెప్స్ ఉండే విధంగా సాంగ్స్ ను మేకర్స్ డిజైన్ చేసినట్లు అర్థం అవుతుంది. మరి ధమాకా మూవీ మాదిరి గానే మాస్ జాతర సినిమా ద్వారా కూడా రవితేజ , శ్రీ లీల ప్రేక్షకులను ఆకట్టుకుంటారా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt