టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా తెలుసు కదా అనే సినిమాలో హీరోగా నటించాడు. సిద్దు కొంత కాలం డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీలలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన జాక్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయిన కూడా తెలుసు కదా సినిమా పై ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా మాత్రం భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.43 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 54 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.94 కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.87 కోట్ల షేర్ ... 8.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఏడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 43 లక్షలు , ఓవర్సీస్ లో 1.68 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు వారం రోజుల్లో 6.98 కోట్ల షేర్ ... 13 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.ఈ మూవీ 23 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 16 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: