మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఈ మూవీ మేకర్స్ అనేక తేదీలను ప్రకటించారు. కానీ ఈ మూవీ చాలా సార్లు విడుదల వాయిదా పడింది. కొంత కాలం క్రితమే ఈ సినిమాని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత నుండి ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. సెన్సార్ బృందం నుండి ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ లభించింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమాలో మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అని. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇప్పటికే రవితేజ , శ్రీ లీల కాంబో లో  వచ్చిన ధమాకా మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మరో సారి వీరిద్దరి కాంబోలో రూపొందిన మాస్ జాతర సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని రవితేజ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమాతో రవితేజ , శ్రీ లీల జంటకి  ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt