టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినిమా ‘బాహుబలి’ ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రూపొందించిన ఈ స్పెషల్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వెర్షన్‌ను దర్శకుడు ప్రత్యేకంగా రీ-కట్ చేసి, రీ-మాస్టర్ చేయించారు. అంటే, రెండు భాగాలను ఒకే సినిమాగా మిక్స్ చేసి కొత్త టెక్నాల‌జీతో సౌండ్‌, విజువల్‌ క్వాలిటీని మరింత మెరుగుపరిచారు. దీనివల్ల ప్రేక్షకులు పెద్ద తెరపై మరింత భిన్నమైన, అద్భుతమైన అనుభవాన్ని పొందబోతున్నారు.


‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) రెండు సినిమాలు భారతీయ సినిమాకు కొత్త చరిత్ర రాశాయి. ఇప్పుడు వాటిని ఒకే ఫ్రేమ్‌లో, కొత్త ఎడిటింగ్‌ టెక్నిక్‌తో మళ్లీ ప్రదర్శించడం సినీప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభమైన 24 గంటల్లోనే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో దాదాపు 61 వేల టిక్కెట్లు అమ్ముడవడం దీనికి నిదర్శనం. మిగతా బుకింగ్‌ కౌంటర్లు తెరచిన తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ (అమరేంద్ర మరియు మహేంద్ర బాహుబలి పాత్రల్లో), రానా దగ్గుబాటి (భల్లాలదేవుడిగా), అనుష్క శెట్టి (దేవసేనగా), తమన్నా భాటియా (అవంతికగా) అద్భుతమైన నటన కనబరిచారు. వీరి నటనతో పాటు, ఎం.ఎం. కీరవాణి అందించిన మధురమైన సంగీతం, సెంటి సౌండ్ మరియు వీఎఫ్ఎక్స్‌ ఈ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో గుర్తింపునిచ్చాయి.


‘బాహుబలి: ది ఎపిక్’‌ను ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ రీ-మాస్టర్ వెర్షన్‌లో కొన్ని కొత్త సన్నివేశాలు, కట్ చేయబడిన సీక్వెన్సులు, నూతన విజువల్ ఎఫెక్ట్స్ తో సినీ అభిమానులు పూర్తిగా కొత్త అనుభూతిని పొందుతారని సినిమా యూనిట్‌ చెబుతోంది. ప్రేక్షకులు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ ఇది కేవలం సినిమా కాదు, ఒక అనుభవం ” “బాహుబలి రీ రిలీజ్ అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు మళ్లీ వస్తున్నాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: