మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

అలాగే ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ సినిమా హీరో అయినటువంటి రవితేజ , హీరోయిన్ అయినటువంటి శ్రీ లీల కూడా విచ్చేసింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది. 

దానితో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. ప్రస్తుతం మాస్ జాతర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన శ్రీ లీల ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ , శ్రీ లీల కాంబోలో ధమాకా అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత రవితేజ కు విజయం దక్కలేదు. దానితో రవితేజ శ్రీ లీల కాంబో లో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని రవితేజ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: