తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా , దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాహుల్ రవీంద్రన్ ఒకరు . ఈయన మొదటగా నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి అనే సినిమా ద్వారా ఈయన నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ద్వారా ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత ఈయన చాలా సినిమాలలో నటించాడు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు చి లా సౌ , మన్మధుడు 2 అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇందులో చి లా సౌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈయన రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందిన ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో రాహుల్ రవీంద్రనన్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో అత్యంత బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాహుల్ రవీంద్రనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ... నాకు కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ సమయంలో ఆ సినిమా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి అనే సినిమాలో ఈయన ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rr