సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి రష్మిక చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. మహేష్ బాబు వయసు గురించి ప్రశ్నించగా, ఆమె ఎంతో మనస్ఫూర్తిగా స్పందిస్తూ,“మహేష్ గారు ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తారు. ఆయన వయస్సు ఎప్పటికీ పెరగదని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే రోజురోజుకూ మరింత యంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది ఆయనలో నాకు చాలా ఇష్టమైన విషయం. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని కూడా నాకు చాలా ఆసక్తిగా ఉంది,” అని రష్మిక తెలిపారు. అయితే ఇది ఆమె సినిమా ప్రమోషన్స్ కోసం మాట్లాడింది అని.. గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ కోసం మహేశ్ ని వాడుకుంటుందని ఘాటు గా రియాక్ట్ అవుతున్నారు జనాలు.
అంతేకాకుండా, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొద్దిగా మాట్లాడిన రష్మిక,“నాకంటూ కొంతమంది చాలా సన్నిహితమైన బెస్టీలు ఉన్నారు. కానీ వాళ్ల పేర్లు మాత్రం నేను చెప్పను. ఎందుకంటే వాళ్ల పేర్లు చెబితే నన్ను చంపేస్తారు,”అని నవ్వుతూ చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె అందం, సింప్లిసిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను ప్రశంసిస్తున్నారు. ఇక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్ సృష్టించగా, నవంబర్ 7న రష్మిక మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.
            
                            
                                    
                                            
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి