సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్‌ ను ఎవరు రిజెక్ట్ చేస్తారు చెప్పండి! ముఖ్యంగా మన తెలుగు సినిమా హీరోలు అయితే, కొత్తగా హిట్ అవుతున్న బ్యూటీస్, ట్రెండ్‌లో ఉన్న హీరోయిన్‌లను తమ సినిమాల్లో కాస్ట్ చేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఈ కాలంలో ఓ హీరోయిన్ కి కొంచెం ఫేమ్ పెరిగినా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెరిగినా, యూట్యూబ్ సాంగ్స్ వైరల్ అయినా – వెంటనే పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ఎందుకంటే హీరోలకి, దర్శకులకి కూడా “లేటెస్ట్ క్రేజ్” అంటే చాలా ఇంపార్టెంట్.


మన టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. చిన్న హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు, అందరూ తమ సినిమాల్లో లేటెస్ట్ సెన్సేషన్‌ హీరోయిన్స్‌ ని తీసుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. నేటి ప్రేక్షకులు ఎవరిని చూడాలనుకుంటారో, సోషల్ మీడియాలో ఎవరికి క్రేజ్ ఉందో – ఆ కరెంటు టాప్ హీరోయిన్‌ ను సినిమాలో పెట్టుకోవడం అనే ఫార్ములా చాలా కామన్ అయిపోయింది.



కానీ ఈ రూల్ కి ఒకే ఒక ఎక్సెప్షన్ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు — మన రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగు సినీ ఇండస్ట్రీలో  ప్రభాస్‌ కి ఉన్న రేంజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత ఆయన పేరే ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నా, ఆ సినిమా చుట్టూ ఒక నేషనల్ హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటి స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్  డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ గురించి ఇప్పటికే చాలానే హంగామా జరుగుతోంది. ఈ సినిమాలో మారుతి ముగ్గురు హీరోయిన్‌లను చూపించాలనే ప్లాన్ చేశారట. అందులో ఒకరిగా శ్రీలీలను తీసుకుందాం అనే ఆలోచన కూడా వచ్చింది. మారుతి గారికి శ్రీలీల యూత్‌లో ఉన్న పాపులారిటీ, ఆమె డాన్స్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బాగా నచ్చాయి. అంతేకాదు, ఆమె అప్పట్లో టాప్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్‌ కాబట్టి, ఆమె పేరు సినిమాలో ఉండటం మార్కెటింగ్ పాయింట్ కూడా అవుతుందని భావించారు.



అయితే ఈ ఐడియాకు మాత్రం ప్రభాస్ స్ట్రైట్‌గా “నో” చెప్పారట! ఆ మాటకి షాక్ అయిన మారుతి గారికి, యూనిట్‌కి ప్రభాస్ ఇచ్చిన రీజన్ మాత్రం చాలా సింపుల్ కానీ లాజికల్ అనిపించిందట. ఆయన చెప్పిందేమిటంటే — “శ్రీలీల చాలా టాలెంటెడ్, చాలా గుడ్ పెర్ఫార్మర్. కానీ నా పక్కన ఆమె హైట్, ఫిజికల్ మాచింగ్ సరిగ్గా సూట్ అవ్వదు. ప్రేక్షకులకు ఓన్‌స్క్రీన్ పేయరింగ్ బిలీవబుల్‌గా కనిపించకపోవచ్చు” అని చెప్పారట. నిజానికి ప్రేక్షకులు కూడా అప్పుడే సోషల్ మీడియాలో అదే కామెంట్ చేశారు — ప్రభాస్ లాంటి టాల్ హీరో పక్కన శ్రీలీల చాలా చిన్నగా కనిపిస్తుందని. కాని ప్రజల కంటే ముందుగానే ప్రభాస్ ఆ ఫ్యాక్టర్‌ని రియలైజ్ అయ్యారట. అందుకే భవిష్యత్తులో ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ముందే నిర్ణయం తీసుకుని, “ఈ సినిమాలో శ్రీలీల వద్దు” అని స్పష్టంగా చెప్పేశారట.



ఇది నిజంగా చాలా అరుదైన విషయం. ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోలు హీరోయిన్‌ సెలక్షన్‌లో అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ప్రభాస్ మాత్రం ప్రతి సినిమా విషయంలో ప్రతి డీటైల్‌ కూడా కేర్ తీసుకుంటారని ఇండస్ట్రీలో పేరుంది. ఆయన కెరీర్‌లో ఇలాంటి ప్రొఫెషనల్ అప్రోచ్‌ నే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: