- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రీ – రిలీజుల్లో కొత్త చరిత్రను సృష్టించిన ‘ బాహుబలి : ది ఎపిక్ ’ ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. మొదటి మూడు రోజులు అద్భుతమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లిన ఈ రీ ఎడిటెడ్ వెర్షన్, సోమవారం నుంచి స్పష్టమైన డ్రాప్‌ను నమోదు చేసింది. శ‌ని, ఆది వారాల్లో సినిమా బాగానే రాబ‌ట్టింది. ఇక బీ, సీ సెంట‌ర్లు వ‌దిలేస్తే
హైదరాబాద్ , విశాఖ , బెంగళూరు లాంటి మెట్రో సెంటర్స్‌లో మాత్రం ఇంకా మంచి ఆడియన్స్ టర్న్ అవుతున్నారు కానీ, బీ & సీ సెంటర్స్‌లో వసూళ్లు గణనీయంగా తగ్గినట్టు ట్రేడ్ టాక్ చెపుతోంది. శని, ఆదివారాల్లో దాదాపు అన్ని స్క్రీన్లు హౌస్‌ఫుల్‌గా నడిచాయి. రెండు భాగాలు కలిపి ఒకే థియేటర్‌లో చూడాలన్న అభిమానుల కోరిక మూడు రోజుల్లోనే నెరవేరడంతో తర్వాత క్రేజ్ తగ్గింది.


మొదట బయ్యర్లు, ఫ్యాన్స్ వర్గాలు ఈ రీ – రిలీజ్ కనీసం రూ.50 నుండి రూ.100 కోట్ల వరకు గ్రాస్ రాబడుతుందని అంచనా వేశారు. ఆ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ న‌మోదు అయ్యాయి. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఆ టార్గెట్ అందుకోవడం కష్టమనిపిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.10 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ వారంలో హాఫ్ సెంచరీ మార్క్ చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం బాహుబలి మ్యాజిక్‌ ఇంకా కొనసాగుతోంది.


ముఖ్యంగా ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం పూర్తికాకుండానే 30,000 టికెట్లు సేల్ అయిపోయాయి. అల్లు అర్జున్ ఏఏఏ కమ్యూనిటీ స్క్రీన్, రవితేజ ఏఆర్టీ ఎపిక్ స్క్రీన్ షోలకూ టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫుల్ హౌస్ సీన్ కనిపించడం లేదు. ఎంత చెప్పినా, రీ–రిలీజుల హిస్టరీలో ‘బాహుబలి: ది ఎపిక్’ కొత్త రికార్డులు సృష్టించిన చిత్రం అనేది అంగీకరించక తప్పదు. ఇప్పుడు ఈ ఎపిక్ హడావిడి ముగిసిన తర్వాత సినీ ప్రేక్షకుల దృష్టి నవంబర్ 15న జరగబోయే ఎస్‌ఎస్‌ఎంబీ 29 లాంచ్ ఈవెంట్‌పై నే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: