టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తప్ప మరో లోకంలో లేనట్టు ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు షూటింగ్ పరంగా వరుసగా ఏదో ఒక బ్రేక్ పడుతూనే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాను థియేటర్లలోకి తేవాలన్నది రాజమౌళి ప్లాన్. అప్పటివరకు ఎన్టీఆర్ గాని రామ్‌చరణ్ గాని ఎలాంటి కమిట్మెంట్ లు పెట్టుకునే పరిస్థితి లేదు.
రాజమౌళి తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి అన్న దానిపై ప్రస్తుతానికి ఎన్టీఆర్ మదిలో ఎవరు లేకపోయినా... అరవింద సమేత వీర రాఘవ టేకింగ్ కు ఫ్లాట్ అయిన ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో మరోసారి సినిమా చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య చర్చలు జరిగాయని... జనతా గ్యారేజ్ సినిమా టైం లోనే మైత్రి మూవీస్‌తో ఎన్టీఆర్ మరో సినిమాకు కమిట్ అయ్యాడని టాక్ ఉండనే ఉంది.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తర్వాత అన్నీ కుదిరితే మైత్రి - ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఛాన్స్ ఉందని అంటున్నారు. వరుస డిజాస్టర్లతో ఉన్న వినాయక్ కూడా అదుర్స్ 2 చేయాలని హడావిడి చేస్తున్నాడు. చిరు 152 తర్వాత కొరటాల శివ కూడా మరోసారి ఎన్టీఆర్‌తో చేయాలనుకుంటున్నాడు. టెంపర్ తర్వాత హిట్ లేని పూరి కూడా ఎన్టీఆర్‌తో హిట్ తీసి మరోసారి సత్తా చాటాలనుకుంటున్నాడు. వీళ్ల లెక్కలు ఇలా ఉంటే ఎన్టీఆర్ మదిలో ఎవరు ? ఉన్నారన్నది ఆర్ ఆర్ ఆర్ తర్వాతే తేలనుంది.