ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి దాదాపుగా ఫాంలోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రామ్ కెరియర్ లో కూడా బిగ్ హిట్ అందుకుంది.   


ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ కథ అని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా ఫైటర్ అని నిర్ణయించారట. రీసెంట్ గా ఛార్మి ఫిల్మ్ ఛాంబర్ లో ఫైటర్ టైటిల్ రిజిస్టర్ చేయించారట. 


విజయ్ దేవరకొండ కటౌట్ కు ఫైటర్ అన్న టైటిల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. రీసెంట్ గా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.  


ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో బ్రేకప్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే పూరి ఫైటర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో పూరి తన సత్తా చాటాడు. అయితే హిట్టు వచ్చింది కదా అని రిలాక్స్ అవకుండా విజయ్ దేవరకొండతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: