ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో...ఒక దేశానికే కాక ప్రపంచం సినిమా ప్రేక్షకులకు రుచి చూపించాడు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రధానిగా ఉన్న మోడీ కూడా బాహుబలి సినిమా యూనిట్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ..హీరో ప్రభాస్ ని డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుని అభినందనలు చెప్పటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఒక 'బాహుబలి' రికార్డులు మినహా వస్తున్న సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది.


దీన్ని బట్టి చెప్పవచ్చు రాజమౌళి సినిమా అంటే ఏంటో అని. ఇప్పటివరకు బాహుబలి 2 దరిదాపుల్లోకి ఏ సినిమా రికార్డ్స్ సృష్టించలేదు...చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు విడుదలైన కానీ నాన్ బాహుబలి రికార్డ్స్ మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కొంతమంది పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో బాహుబలి 2 రికార్డ్స్ రీప్లేస్ చేయడం ఖాయమని...చాలామంది అనుకున్నారు. వాటిలో ఎక్కువగా సాహో మరియు సైరా సినిమాల పేర్లు వినపడటం జరిగాయి. కానీ సాహో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన కేవలం మొట్ట మొదటి రోజు మాత్రమే కలెక్షన్లు సాధించి తర్వాత రోజునుండి పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయింది.


అయితే తాజాగా వచ్చిన సైరా కలెక్షన్ల పరంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన బాహుబలి 2 దగ్గర్లోకి కూడా రాలేదని వచ్చిన కలెక్షన్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో బాహుబలి 2 రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా...మళ్లీ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా వల్లే అవుతుందని అంటున్నారు చాలామంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసమే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: