
కథ :
తిన్నడు(మంచు విష్ణు) బాల్యం నుంచి దేవుడిని నమ్మడు. శివుడిపై ఏ మాత్రం నమ్మకం లేని తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారాడు? నెమలి (ప్రీతి ముకుందన్) ప్రేమలో ఎలా పడ్డాడు? నెమలి తిన్నడి జీవితంలోకి రావడంతో అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తిన్నడి జీవితంలో ఈశ్వరుడు(అక్షయ్ కుమార్) పోషించిన పాత్ర ఏంటి? తిన్నడు వాయులింగం కోసం ఎందుకు పోరాడాల్సి వచ్చింది.
నాస్తికుడు అయిన తిన్నడు మహా భక్తునిగా కన్నప్పగా మారడంలో రుద్ర(ప్రభాస్), కిరాత(మోహన్ లాల్), మహాదేవ శాస్త్రి(మోహన్ బాబు) పోషించిన పాత్ర ఏమిటి? తిన్నడు తన రెండు కళ్ళను దేవునికి నైవేద్యంగా ఎందుకు సమర్పించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
ఈ తరం ప్రేక్షకులకు భక్త కన్నప్ప గురించి పెద్దగా తెలియకపోయినా ముందు తరాలకు మాత్రం భక్త కన్నప్ప చరిత్ర తెలుసు. మంచు విష్ణు ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో మంచు విష్ణు ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పగా సినిమాలో చివరి గంట మాత్రం వేరే లెవెల్ లో ఉంది. ప్రభాస్, మోహన్ లాల్ పాత్రలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రుద్ర పాత్రలో ప్రభాస్ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. ప్రభాస్ నటించడం వల్ల ఈ సినిమా రేంజ్ ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తిన్నడులోని వేర్వేరు కోణాలను అద్భుతంగా చూపించే విషయంలో సక్సెస్ అయ్యాడు. వాయు లింగం కోసం గిరిజన తెగలు పోరాటం చేయడం కథకు కొత్త అర్థాన్ని తెచ్చింది. మోహన్ బాబు మహావేదశాస్త్రి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. ఆయన తప్ప ఈ పాత్రకు మరే నటుడు సూట్ కారని చెప్పడం అతిశయోక్తి కాదు. నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై స్పష్టంగా కనిపిస్తోంది.
సినిమాలో ఉన్న శివ శివ శంకర సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే విజువల్ ఎఫెక్ట్స్ మెజారిటీ సన్నివేశాల్లో బాగుంది. న్యూజిలాండ్ లో ఈ సినిమాను షూట్ చేసి మంచి పని చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మంచు విష్ణు ఈ సినిమాతో నిర్మాతగా కూడా మంచి ఫలితాన్ని అందుకునే ఛాన్స్ అయితే ఉంది.
బలాలు : మంచు విష్ణు నటన, ప్రభాస్ పాత్ర, క్లైమాక్స్, మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు, నిర్మాణ విలువలు
బలహీనతలు : ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు, నిడివి
రేటింగ్ : 3.0/5.0