ఆ మద్య బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాల్టీ షోలో పద్నాలుగు మంది కంటెస్టంట్లు పాల్గొన్నారు. అందులో మూవీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా ఒక సభ్యుడిగా పాల్గొన్నారు. అప్పటి వరకు అంతంత మాత్రమే తెలిసిన కత్తి మహేష్ ‘బిగ్ బాస్’ షో పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు బాగానే నోట్ అయ్యారు. ఆ తర్వాత కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ విషయంలో కొన్ని నెగిటీవ్ మాటలు మాట్లాడటంతో..పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ ని ఫోన్లో, సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కొంత మంది చంపుతామని కూడా బెదిరించారు.
దీంతో పలు చానల్స్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు..కత్తి మహేష్. ఇదిలా ఉంటే ఈ మద్య ‘జబర్థస్త్’ కామెడీ షో హైపర్ ఆది ఓ స్కిట్ లో కత్తి మహేష్ ని ఉద్దేశించి ‘ముందు పొట్ట..వెనుక బట్ట ఉండి రివ్యూలు రాసినట్టు కాదు’ అని జోక్ పేల్చాడు. దీనిపై స్పందించిన కత్తి మహేష్ మరోసారి సోషల్ మీడియాలో ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కట్ చేస్తే..ఈ మద్య ఓ ప్రోగ్రామ్ లో వీరిద్దరూ కలిసిన ఫోటో ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మేం మేం కలిసే ఉంటారు..మద్యలో దూరిన అభిమానులు వెదవలు అవుతారని వ్యంగాస్త్రాలు సందించారు కత్తి మహేష్.
దీనిపై స్పందించిన హైపర్ ఆది తనదైన స్టైల్లో కత్తి మహేష్ కి కౌంటర్ ఇచ్చారు. అభిమానులు వెధవలు అనడం సరైన పదం కాదని..తాను కూడా పవన్ అభిమానినే..అంటే నేనూ వెధవనేనా అని సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏ హీరో అభిమానులైనా సరే కొడతారని వార్నింగ్ ఇచ్చారు.