ఇండస్ట్రీలో ఒక హీరో కాదన్న సినిమాను మరో హీరో చేయడం అనేది చాలా కామన్. అలాంటి సినిమలు చాలానే ఉన్నాయి. అయితే వదులుకున్న సినిమా ఫ్లాప్ అయితే ఓకే కాని హిట్ అయితే మాత్రం మంచి ఛాన్స్ మిస్ అయ్యామని హీరోలు బాధపడతారు. ఇక ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా ముందు శర్వానంద్ కు చెప్పాడట మేర్లపాక గాంధి.


శర్వానంద్ తో ఆల్రెడీ ఎక్స్ రాజా హిట్ కొట్టిన మేర్లపాక గాంధి ఈ సినిమాను శర్వాతో చేద్దామని అనుకున్నాడు. కాని ఎందుకో శర్వాకి ఈ ప్రాజెక్ట్ మీద అంత నమ్మకం కుదరలేదట. అందుకే కథ బాగాలేదని సినిమా వదులుకున్నాడట. అయితే ఇదే కథ నాని ఓకే చేసి షాక్ ఇచ్చాడు. కృష్ణా, అర్జున రెండు పాత్రల్లో నాని కనిపించనున్నాడు.


సినిమా మొత్తం నాగార్జున హలో బ్రదర్ టైపులో ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి నాని మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఎం.సి.ఏ కూడా హిట్ అవడంతో నాని క్రేజ్ మరింత పెరిగింది. ఇక రాబోతున్న కృష్ణార్జున యుద్ధం కూడా సూపర్ హిట్ పక్కా అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందిస్తున్నాడు.


ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. అంతేకాదు నిన్న కనుమ సందర్భంగా సినిమాలో ఓ సాంగ్ కూడా వదిలారు. ఏప్రిల్ 14న రిలీజ్ ప్లాన్ చేస్తున్న సినిమా అంచనాలను అందుకుంటే నాని రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి నాని కృష్ణార్జున యుద్ధం సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: