గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వస్తున్న కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి మేనిఫెస్టో మంగళవారం మధ్యాహ్నం రిలీజ్ అయింది.
మేనిఫెస్టో పైకి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.. పైగా మేనిఫెస్టోలో చాలా హైలెట్ అంశాలు ఉన్నాయి.. నెలకు రూ.3, 000 నిరుద్యోగ భృతి,  ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం,  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15,000,  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు , మెగా డీఎస్సీ మీద తొలి సంతకం,  ఆడపిల్లల విద్యకు "కలలకు రెక్కలు" పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం , అన్న క్యాంటీన్లు,  పండగ కానుకలు,  వలంటీర్లకు రూ.10,000 జీతం ఇలా మేనిఫెస్టో లో పొందుపరిచిన అంశాలు అన్నీ  బాగున్నాయి..


అయితే మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడండి పురుగులు ఉండు.. అన్నట్టుగా గతంలో చంద్రబాబు ప్రకటించిన చాలా మేనిఫెస్టోలు , హామీలు చూడటానికి బాగానే ఉన్నాయి.. అయితే వాటి అమలుకు వచ్చేసరికి చంద్రబాబు చేతులు ఎత్తటం ఎన్నికల్లో గెలిచాక మాట మడత వేయటం కామన్ గా జరుగుతూ వస్తోంది.. 2014 ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు కారణమైన రుణమాఫీ,  ఆ తర్వాత ఆయన అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.. ఇప్పుడు కూడా చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు అమలు చేసేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి .. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ ఎంతవరకు సరిపోతుందనే  సందేహాలు కూడా ఉన్నాయి.

మరి ఒకేసారి ఇన్ని పథకాలను ప్రవేశపెట్టారు.. పైగా కులాల వారీగా , మతాలవారీగా ఊరిస్తూ వరాలజల్లు కురిపిస్తున్నారు.. మరి వీటన్నింటినీ ఆయన ఏ మేరకు నెరవేరుస్తాడు అన్న సందేహం ఓటర్లలో బలంగా మొదలైంది.. గత ఎన్నికల్లోనే మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు.. ఈసారి మాట నిలబెట్టుకుంటాడా అన్న అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.. మరి ప్రజలు ఏ మేరకు మేనిఫెస్టోపై స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: