ఎన్నికలు వచ్చాయంటే చాలు  ప్రతి పార్టీ  వారి వారి ఆలోచనలతో  ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఓటర్ల మనసులు గెలుచుకునేలా  ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల పథకాలు  తీసుకువచ్చి ప్రజలను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు.  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన  అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇదే తరుణంలో  టిడిపి కూటమి,వైసీపీ  మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ క్రమంలోనే మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామని అనేక వాగ్దానాలు చేస్తూ  ముందుకు వెళ్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో  వైసిపి పార్టీ  నవరత్నాల పేరుతో వారి యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేసింది.

 అయితే ఈ మేనిఫెస్టో 2019లో ఏ విధంగా అయితే పథకాలు ఉన్నాయో అవే పథకాలను కొనసాగింపుగా కాస్త  పెంచుతూ మళ్లీ  అమలు చేస్తామని వైసిపి మేనిఫెస్టో ప్రకటించారు. కానీ ఆ మేనిఫెస్టోలో  ప్రజలు ఊహించినంత మేర  పథకాలు లేవు అన్నట్టు చప్పగా ఉందని అంటున్నారు. ఇక జగన్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత అందరి దృష్టి టిడిపి కూటమి మేనిఫెస్టో పై పడింది. మేనిఫెస్టో కోసం కళ్ళు కాయలు కాచేలా చూసారు. అయితే మంగళవారం టిడిపి కూటమి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇందులో అనేక రకాల పథకాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.ఈ పథకంతో చాలా వరకు మహిళలు కూటమి వైపు చూస్తారు. ఉచిత బస్సు పథకం కర్ణాటకలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  

అదే పథకం తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. దీంతో ఆ పథకాన్ని చంద్రబాబు తన మేనిఫెస్టోలో చేర్చడంతో ఇది మహిళా ఓటర్లను విపరీతంగా ప్రభావితం చేస్తుందని కొంతమంది భావిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వన్ సైడ్ వార్ జరిగిందో  ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగానే జరిగే అవకాశం ఉందని,మహిళల ఓట్లు ఎక్కువ శాతం టిడిపికి పడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా  రైతుల కోసం, నిరుద్యోగుల కోసం,ఉద్యోగుల కోసం ఇలా అన్ని వర్గాల అభివృద్ధి కోరుతూ ఈ మేనిఫెస్టోలో  పథకాలను చేర్చారు. ఈ మేనిఫెస్టో చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఒక్కసారిగా ప్రజలను ఆలోచించే విధంగా వార్ వన్ సైడ్ అయ్యేలా  చేస్తుందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: