త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సినిమా లుక్ గురించి మార్పులు చేసుకుంటున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఎక్కువగా తన ఇంటిలోనే కాలం గడుపుతున్నాడు. ఒకవైపు తన లేటెస్ట్ సినిమా గురించి చర్చలు చేస్తూనే మరొక వైపు తన కూతురుతో ఆడుకుంటూ కాలం గడుపుతున్న బన్నీ తన కూతురుని అడిగిన ప్రశ్నకు అర్హ అల్లు అర్జున్ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చింది. 
చాలా మంది హీరోయిన్ల పేర్లు
దీనితో తన కూతురి తెలివి తేటలకు ముచ్చట పడుతున్న అల్లు అర్జున్ తన కూతురి తెలివి తేటలను వివరిస్తూ తన అభిమానులకు ఆవిషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ గా మారింది. అల్లు  అర్జున్ తన కూతురును తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోమని కూతురు అర్హను అడిగాడు. అయితే ఆ ప్రశ్నకు బన్నీ కూతురు ముద్దుగా సమాధానం ఇస్తూ "నేను చేసుకోను" అంటూ అర్హ సమాధానం చెప్పింది.
 అదిరిపోయే చిత్రాన్ని
ఇప్పుడు వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ 24 గంటల్లోపే 1 మిలియన్ వ్యూస్ ను దాటేయడంతో పాటు ఆ వీడియోకు విపరీతంగా ఫ్యాన్స్ నుండి లైక్స్ షేర్స్ రావడంతో ఈవార్త అల్లు కాంపౌండ్ ను జోష్ లో ముంచెత్తి వేస్తోంది. అల్లు అర్జున్ తాను స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు తన కూతురుకు మాత్రం తాను ఎంపిక చేసిన అబ్బాయిని పెళ్ళి చేసుకోమని చెప్పడం విచిత్రంగా ఉంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
చాలా మంది హీరోయిన్ల పేర్లు
దీనితో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా అతడి పిల్లలు కూడ చిన్నతనంలోనే సెలెబ్రెటీలుగా మారిపోయారు. ముఖ్యంగా బన్నీ భార్య స్నేహా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఎక్కువగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తున్న నేపధ్యంలో ఆమెకు కూడ అల్లు అర్జున్ స్థాయిలో రోజురోజుకు ఫాలోయర్స్ పెరిగిపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: