తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలపైనే కాదు సినిమాలపై కూడా ఈ మద్య బాగా దృష్టి సారిస్తున్నారు. టాలీవుడ్ లో పవురు సినీ తారలు కేటీఆర్ తో టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్' మూవీ చూసి తెగ సంతోష పడ్డారు. అంతే కాదు కేజీఎఫ్ లో నటించిన కన్నడ రాక్ స్టార్ యష్ ని ఎంతో ప్రశంసించారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.250 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షంచారు.
సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'కొద్దిగా ఆలస్యంగానైనా 'కేజీఎఫ్' మూవీ చూశా... వాట్ ఏ మూవీ.. టెక్నికల్ గా అద్భుతంగా ఉంది. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయింది' అంటూ ప్రశంసించారు. మొత్తానికి కన్నడ భాషలో నటించిన హీరోకి ఈ రేంజ్ లో ప్రశంసలు రావడంతో యష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.