నందమూరి బాలక్ఱిష్ణ క్రమశిక్షణ విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటాడు. అలాగే తన మూవీలకి సంబంధించిన విషయంలోనూ ముహుర్త బలాలని బలంగా నమ్ముతాడు. అలాగే తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన రిలీజ్ విషయంలో ఇదే విషయాన్ని రిపీట్ చేశాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, సత్యదేవ దర్శకత్వంలో వెలువడుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'లయన్‌. ఈ చిత్రాన్ని మే 14న ఉదయం 9.26 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా నిజానికి మే 8న రిలీజ్‌ కావల్సిన మూవీ, అనివార్య కారణాలతో రిలీజ్ కి నోచుకోలేదు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. మణిశర్మగారు చాలా అద్భు తమైన సంగీతాన్ని అందించారు. బాలకృష్ణగారి కాంబినేషన్‌లో ఆయన చేసిన సమరసింహారెడ్డి, నరసిం హారెడ్డి ఎంతపెద్ద బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయో తెలిసిందే.

'లయన్‌' కూడా ఆడియోపరంగా, సినిమా పరంగా ఆ సినిమాల స్థాయిలో విజయం సాధి స్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మే 14న లయన్ రిలీజ్ కి పెట్టిన ముహుర్తం పై బాలక్రిష్ణ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట.  

మరింత సమాచారం తెలుసుకోండి: