అమెరికాలో ఎంతో మంది భారతీయ వివిధ స్థాయిలలో ఉద్యోగాలు, కంపెనీలు నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలలో ఉంటూ భారతీయులకి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతంది ఎన్నారైలు  డబ్బుకి ఆశపడి మోసాలకి పాల్పడుతూ భాతీయుల పరువుని బజారుకి ఈడ్చే నేరాలలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన వీసా మోసం కేసులో ముగ్గురు తెలుగు ఎన్నారైలని దుపులోకి తీసుకున్నారు అమెరికా పోలీసులు. వివరాలలోకి వెళ్తే..

 Image result for four indian nris arrested h1-b visa fraud

అమెరికాలోని న్యూజెర్సీ , కాలిఫోర్నియా లోని రెండు వేరు వేరు ఐటీ కంపెనీలకి చెందిన విజయ్ మానె ,  వెంకట రమణ,  ఫెర్నాండో సిల్వా, సతీష్ వేమూరి, అనే ముగ్గురు ప్రవాస భారతీయులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు న్యూజెర్సీ కేంద్రంగా, ప్రొఫెషనల్స్‌,  క్లైంట్‌ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో ఐటీ స్టాఫింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు.

 Related image

ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం పొందాలనుకునే విదేశీయులకి హెచ్ -1 బీ వీసా ఇప్పించుతామని చెప్పి మోసం చేస్తున్నారు. దాంతో తగిన సమాచారం అందుకున్న పోలీసులు వారిని వలపన్ని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. అయితే వారు 2.5 లక్షల పూచీకత్తు తో బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఈ నేరం పై ఇప్పటికే ఎంతో మందిని అరెస్ట్ చేశారని, ఇలాంటి వాటిపై తీవ్ర చర్యలు ఉంటాయని అంటున్నారు అధికారులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: