రోజులు గడుస్తున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దేశాల్లో మారణ హోమం జరుగుతుంది. అయినప్పటికీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు అన్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ మధ్య ఆదిపత్యం కోసం జరుగుతున్న పోరు ఎంతోమంది సాధరణ ప్రజల పాలిట శాపంగా మారిపోతుంది అని చెప్పాలి. ఏకంగా కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఎన్ని సార్లు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు మాత్రం విఫలం అవుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై  ఆధిపత్యం ఎలా సాధించాలి అనే ఉద్దేశంతో రష్యా.. ఇక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఉక్రెయిన్ హోరాహోరీగా పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. ఇక ఎంతోమంది సైనికులు అసువులు బాసినప్పటికీ కూడా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎంతో ప్రమాదకరమైన ఆయుధాలను కూడా ప్రయోగిస్తూ ఉండడంతో.. ఇక రెండు దేశాల ప్రజలు కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకుతూ ఉన్నారని చెప్పాలి. ఏకంగా ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో తమ దేశానికి చెందిన 89 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా పేర్కొంది.


 అయితే సెల్ఫోన్లో వినియోగం కారణంగానే ఇలా 89 మంది సైనికులు మృతి చెందారు అన్న విషయాన్ని రష్యా తెలిపింది అని చెప్పాలి. అయితే రష్యా సైనికులకు సెల్ఫీ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ వాళ్ళు మొబైల్స్ వాడారు అంటూ చెప్పుకొచ్చింది.  ఈ కారణంగానే తమ దేశ సైనికులు ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని లొకేషన్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రత్యర్థులు గుర్తించి చివరికి ఆయుధాలతో దాడి చేశారు అంటూ రష్యా అభిప్రాయపడుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ యుద్ధంలో మొదటిసారి ఈ రేంజ్ లో ప్రాణ నష్టం జరిగినట్లు రష్యా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: