పాకిస్తాన్లో ఉండే ప్రజల పరిస్థితి రోజురోజుకు మరింత దుర్భరంగా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతుంది. అదే సమయంలో ద్రవ్యోల్బనం  కూడా పెరిగిపోవడంతో ఇక పెరిగినధరలతో అక్కడి ప్రజలందరూ కూడా తీవ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు అన్న విషయాన్ని అంతర్జాతీయ నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ఏకంగా పాకిస్తాన్ పోర్టు సిటీగా పేరుగాంచిన కరాచీలో కెమరీ అనే ప్రాంతంలో చిన్నారులు వరుసగా ప్రాణాలు కోల్పోతూ ఉండడం మాత్రం మరింత సంచలనంగా మారిపోయింది.


 ఓ అంతు చిక్కని వ్యాధి అభం శుభం తెలియని ఎంతో మంది చిన్నారుల ఉసురు తీసేస్తుంది అని చెప్పాలి. ఏకంగా అంతుచిక్కని వ్యాధితో 18 మంది వరకు మృతి చెందారు. ఇక ఇలా మరణించిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు అన్న విషయాన్ని అక్కడి స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు. జనవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యకాలంలోనే ఇక ఈ ప్రాంతంలో 18 మంది మృత్యువాత పడ్డారట. అయితే ఈ వ్యాధికి సరైన కారణాలు తెలియడం లేదు అని చెప్పాలి. కానీ తీరప్రాంత సమీపంలో ఉండడంతో సముద్రం లేదా నీటికి సంబంధించిన ఏదైనా సమస్య వచ్చి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు.


 అయితే ఇలా చని పోయిన 18 మందిలో 14 మంది చిన్నారులే ఉన్నారట. ఇక ఇలా చనిపోవడానికి ముందు బాధితులు తీవ్ర గొంతు నొప్పి, జ్వరం, గొంతు దగ్గర వాపు రావడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఏర్పడటం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వింత వాసన వస్తుందని స్థానికులు సైతం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ఇలా వరుస మరణాల నేపథంలో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: