మనుషుల్లో పెంపుడు జంతువులను పెంచుకునే హ్యాపీ రోజురోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక పెంపుడు జంతువుల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కుక్కలు పిల్లలను మాత్రమే పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చూసాము. ఇక ఇటీవల కాలంలో కొంతమంది అయితే ప్రమాదకరమైన జీవులను సైతం పెంపుడు జంతువులుగా మార్చుకుంటున్నారు. ప్రాణాలు తీసే అనకొండలను.. విషపూరితమైన పాములను.. కొంతమంది అయితే పులులు సింహాలను సైతం పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.


 కొంత మంది ట్రెండ్ ఫాలో అవ్వడానికి ఇలా జంతువులను పెంచుకుంటూ ఉంటే.. మరి కొంత మంది ఇక జంతు ప్రేమికులు కావడం  తో ఇష్టంతో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. ఈ క్రమం లోనే ఇక ఏదైనా పెంపుడు జంతువులను తెచ్చుకోవాలని మార్కెట్లోకి వెళ్తే మాత్రం వాటి ధర చూసి ఒక్క సారిగా నోరేళ్ల పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతూ ఉన్నాయి ఎన్నో జంతువులు. ఇక ఇప్పుడు మనం తెలుసుకో బోయేది కూడా ఇలాంటి జీవి గురించే.



 అయితే ఇది ఒక చిన్న కీటకం. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో లక్షల నుంచి కోట్ల వరకు ఉంది. స్టాగ్ బీటిల్ అనే ఈ కీటకం రెండు నుంచి మూడు అంగుళాల పరిణమానం లో ఉంటుంది.  ఇక ఈ కీటకాన్ని ఎంతోమంది కోట్లు వెచ్చించి  కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన కార్లు అయినా బిఎండబ్ల్యూ, ఆడి లాంటి కార్ల కంటే ఇక ఈ కీటకం ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ కీటకం నుంచి ఎంతో ఖరీదైన మందులను తయారు చేస్తారట. అందుకే దీని ధర కోట్లలో ఉంటుందన్నది తెలుస్తుంది. ఇక ప్రస్తుత కాలం లో ఈ కీటకాల జాతులు అంతరించి పోయే ప్రమాదం కూడా పెరుగు  తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: