
ఎందుకంటే ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులభమైన విషయమా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు అని చెప్పాలి. రోజు చేసే పనినే కాస్త భిన్నంగా ప్రయత్నించి ఇటీవల కాలంలో గిన్నిస్ బుక్ రికార్డుల్లో తమ పేరును ఎక్కించుకుంటున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. దీంతో నేటి రోజుల్లో ప్రపంచ రికార్డు సాధించడం అనేది చాలా సులభం అనే భావన అందరిలో వచ్చేసింది.అని చెప్పాలి. ఇక్కడ ఒక మహిళ ఇలాగే ఒక అంతర్జాతీయ రికార్డును నెలకొల్పింది. సాధారణంగా మహిళలు ప్రతిరోజు ఇంట్లో వంట చేయడం చేస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు.
కానీ ఇలా వంట చేయడం వల్ల కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చా అంటే.. అవును అనే నిరూపించింది ఇక్కడొక మహిళ. నైజీరియన్స్ చెఫ్ హిల్ద బాకీ 100 గంటలు పని చేసి అంతర్జాతీయ రికార్డు నెలకొల్పారు. దీంతో భారత చెఫ్ పేరిట ఉన్న 87 గంటల 45 నిమిషాల రికార్డు చెరిగిపోయింది. ఈ క్రమంలోనే హిల్దా ప్రతి 12 గంటలకు గంట సేపు విశ్రాంతి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో స్థానికులు పాటలు పాడుతూ ఆమెను ఎంకరేజ్ చేయడం గమనార్హం. అయితే అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ఇక రికార్డును అధికారికంగా ప్రకటిస్తామని గిన్నిస్ బుక్ నిర్వాహకులు తెలిపారు.