ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అంటే ఒకప్పుడు ఇక ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ వింతలు విశేషాల గురించి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోగలుగుతున్నారు మనిషి. ఈ క్రమంలోనే ఎన్నో వింతలు విశేషాల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోవడం మనిషి వంతు అవుతుంది.



 ఇక తరచూ ఇంటర్నెట్లో ఎన్నో షాకింగ్ ఘటనలకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వార్త కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో రాసే పెన్ అనేది ఒక భాగమే. చదువుకునేటప్పుడు లేదంటే ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో సైన్ చేసేటప్పుడు ఇలా ప్రతి ఒక్కరు కూడా పెన్ ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎవరికి నచ్చిన పెన్ వారు కొనుగోలు చేస్తూ వాడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా అక్షరాలు రాసే పెన్ ధర ఎంత ఉంటుంది అంటే.. ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వరకు ఉండొచ్చు అని చెబుతారు ఎవరైనా.


 స్పెషల్ గా ఏదైనా పెన్ వాడుతున్నారు అంటే అది మహా అయితే రూ. 100 లేదంటే 200 రూపాయలు ఉంటుంది. ఇంకా ఖరీదైన పెన్ అంటే వేలల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే పెన్ గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెన్ ధర అక్షరాల 66 కోట్ల రూపాయలు. పెన్నుకి ఇంత ధర ఎందుకు బ్రో అంటారా.. ఎంతో విలువైన వజ్రాలు బంగారంతో ఈ పెన్ ను తయారు చేశారు  ఈ పెన్ పేరు పుల్గోరు నాక్టర్నెస్  దీనిని 945 బ్లాక్ డైమండ్స్, బంగారం.. 123 కెంపులతో తయారు చేశారు.  సరే పెన్ను తయారు చేశారు కానీ ఇలా 66 కోట్లు పెట్టి ఒక పెన్ను కొనుగోలు చేసి ఎవరైనా వాడటానికి ధైర్యం చేస్తారా.. ఏమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pen