ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో వెంటాడుతాయి అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. దీని అర్థం మనిషికి పునర్జన్మ ఉంటుందని. మరి నిజంగానే మనిషికి పునర్జన్మ ఉంటుందా అంటే ఇప్పుడు ఎవరూ కూడా బల్లగుద్ది చెప్పలేరు. అచ్చం ఇలాగే ఒక్కసారి ప్రాణాలు కోల్పోయిన మనిషి మళ్ళీ బ్రతకడం సాధ్యమవుతుందా అంటే అది సాధ్యమవుతుందని అంటారు. ఎందుకంటే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలానే చూసి ఉంటారు కదా.


 ఇక సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా ఇలా ఒకసారి చనిపోయిన వ్యక్తి కొన్ని గంటల తర్వాత బ్రతకడం జరుగుతుందని కొంతమంది జనాలు నమ్ముతూ ఉంటారు. కానీ వాస్తవానికి చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతకడం అసాధ్యం. కానీ ఇటీవల కాలంలో సినిమాలను తలపించే ఘటనలు వాటి నిజజీవితంలో కూడా జరుగుతూ చనిపోయారు అని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఊపిరి పోసుకోవడం లాంటి ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక్కడ ఒక మహిళ విషయంలో ఇలాగే జరిగింది. ఆమె చనిపోయింది. కానీ 40 నిమిషాల తర్వాత మళ్లీ బ్రతికింది.


 చనిపోయిన సమయంలో ఆమెకు ఎదురైన అనుభూతిని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంది. ఆరోజు నాకు బాగా గుర్తుంది. నా భర్త నేను డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం. అంతలోపే సోఫాలో కుప్పకూలిపోయా. భర్త స్టూ ఎంత పిలుస్తున్న నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఇంతలో నన్ను హాస్పిటల్కు తీసుకొని వెళ్లడం వాళ్ళు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు గుర్తుంది. కుటుంబ సభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్న. కోమలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషిని అయిపోయాను అంటూ క్రీస్ట్ స్టవర్డ్ అనే మహిళ తెలిపింది. ఈ ఘటన యూకేలో వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: