కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించాలి వృద్ధులోకి రావాలి అనుకునేవారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి.. నాలుగు రోజులు ఎక్కువగా బతికితే చాలు అని అనుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఎంతోమంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందుకంటే అమెరికాలో సాఫ్ట్వేర్ సంక్షోభం అంతకంతకు పెరిగిపోతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి.


 దీంతో ఇక ఉద్యోగం మీద ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ప్రాప్టెక్, బెటర్ డాట్ కామ్, అమెజాన్, యూనిటీ సాఫ్ట్వేర్, గూగుల్ లాంటి ఎన్నో కంపెనీలు తమ సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను చెప్పా పెట్టకుండానే అకస్మాత్తుగా తొలగిస్తూ ఉన్నాయి. గత ఏడాది నుంచే ఇక ఇలాంటి పరిస్థితులను నెలకొన్నాయట. అయితే పరిస్థితులు మెరుగుపడతాయని ఎంతో మంది ఎదురుచూసిన.. ఇక  ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులు రాకపోవడంతో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదట.


 గత ఏడాదిలోనే దాదాపుగా 2,40,000 మందిని ఐటి కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయట. ఈ ఏడాదిలో జనవరి ముగిసే సమయానికి ఏకంగా 32 వేల మంది ఇలా ఉద్యోగాలు కోల్పోయారట. ఇక ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ ప్రాముఖ్యత పెరిగిపోతున్న నేపథ్యంలో.. అటు ఆయా కంపెనీలు ఉద్యోగులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఇక మరోవైపు అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక సమస్యలు కూడా ఇలాంటి లేఅఫ్స్ కు కారణమవుతున్నాయట. అయితే భారత్ నుంచి చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళుతూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సంక్షోభ పరిస్థితులు చూస్తుంటే ఇక చాలామంది అమెరికా వెళ్లడానికి వెనకడుగు వేసే ప్రసక్తి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: