మొన్నటివరకు ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ...ఎన్నికల్లో ఓటమి తర్వాత కష్టాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తిరుగులేని పార్టీగా చెలామణి అయిన టీడీపీ....ఇప్పుడు చెల్లాచెదురైపోయింది. అసలే ఎన్నికల్లో 23 సీట్లే రావడంతో టీడీపీ కుదేలైపోయింది. ఇక ఓటమి తర్వాత నేతలంతా తమ దారి..తాము చూసుకోడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు, వరుసగా క్యూ కట్టి బీజేపీ, వైసీపీల్లోకి జంప్ అయిపోయారు.
మరికొందరు కూడా టీడీపీని వీడటానికి సిద్ధమవుతున్నారు. పార్టీ మారేవాళ్ళ గురించి పక్కనబెడితే....పార్టీలోనే ఉంటూ కొందరు నేతలు అధిష్టానానికి ఎదురుతిరిగి మాట్లాడుతున్నారు. ఇంకా మరికొందరు అయితే అధికారంలో ఉన్నప్పుడే మన పార్టీ...లేనప్పుడు మన పని మనది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎక్కడ అరకొర నేతలు అధినేత చంద్రబాబుతో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. దాని వల్ల టీడీపీకి పెద్దగా ఒరిగేదెమి లేదు.
ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే...టీడీపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అంచెలెంచాలుగా ఎదుగుతూ వచ్చి...అనేక పదవులు అలకరించిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. అధికారం కోల్పోయిన వెంటనే ఆయన మీద...ఆయన కుటుంబం మీద అనేక కేసులు తెరమీదకు రావడంతో..అవమాన భారంతో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన మరణం వల్ల గుంటూరు టీడీపీలో పెద్ద నష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో పెద్ద దేబ్బే.
ఇక కోడెల తర్వాత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో కాలం చేశారు. శివప్రసాద్ మరణం కూడా పార్టీకి తీరని లోటే అని చెప్పొచ్చు. ప్రత్యేక హోదా కోసం ఈయన ఎన్నో వేషాలు వేసి ఢిల్లీ నేతలని ఆకర్షించి ఏపీపై దృష్టి పడేలా చేశారు. ఇలాంటి నేతని కోల్పోవడం టీడీపీకి పెద్ద లాస్. ఈ మరణాలు పక్కనబడితే టీడీపీ 60 సంవత్సరాలు దాటిన నేతలు ఎక్కువ మందే ఉన్నారు. దీని వల్ల కూడా రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పార్టీకి యువరక్తం కావల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని వారిని ఎట్రాక్ట్ చేయడంలో బాబు విఫలమవుతున్నారు. మరి బాబు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికి టీడీపీ కష్టాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉంది.