దిశ రేపిస్టులు ఎన్ కౌంటర్ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, ఏపీలోనే కాకుండా దేశంలోని పలువురు నాయకులు, ప్రముఖులు ఈ ఎన్ కౌంటర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు, ప్రదేశంతో సంబంధం లేకుండా తమ స్పందన తెలియజేస్తున్నారు. నిందితుల ఎన్ కౌంటర్‌తో దిశకు న్యాయం జరిగిందంటూ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సోషల్‌మీడియా వేదికగా తమ స్పందన తెలుపుతున్నారు.

 

హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయని... అలాంటి నిందితులకు ఇలాంటి కఠిన చర్యలే సరైనవని అన్నారు. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్‌ పోలీసుల నుంచి స్ఫూర్తి పొందాలని మెచ్చుకున్నారు. నిర్భయకు కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.


జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందిస్తూ.. ఓ సాధారణ పౌరురాలిగా తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని మేం డిమాండ్‌ చేశాం.. ఏ పరిస్థితుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారో తెలియదు గానీ.. ఇక్కడ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి.. అంటూ తన ఆనందం పంచుకున్నారు.

 

మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ స్పందిస్తూ... ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమాజానికి ఓ మంచి ఉదాహరణ. ఇక నుంచి రేపిస్టులు నేరం చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోతామేమోనన్న భయం ఉంటుందన్నారు. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా మాట్లాడుతూ... థ్యాంక్యూ హైదరాబాద్‌ పోలీస్‌. రేపిస్టులను డీల్‌ చేసే పద్ధతి ఇదే. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మీ నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: