జగం  మెచ్చిన నాయకుడు జనం మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో హామీలు అమలు పరిచి.. ప్రజలందరికీ జగన్ అంటే ఒక దీమాగా  మారిపోయాడు. ఏ సమస్య వచ్చినా జగన్ ఉన్నాడనే ధీమా  ఆంధ్ర ప్రజలలో ఏర్పడింది. పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ వస్తే  రాజన్న పాలన వస్తుంది అనుకున్న ప్రజలందరికీ అంతకుమించిన పాలన అందిస్తూ  ముందుకు సాగుతున్నారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కడప జిల్లాలో తన రెండో రోజు  పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి  సమాధిని సందర్శించనున్నారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్న జగన్... అక్కడ తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించి అన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు... అక్కడి సమీపంలో ఉన్న చర్చ్ వద్దకు చేరుకొని చర్చిలో ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 అనంతరం భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాయచోటి చేరుకొని... జూనియర్ కాలేజీ ఆవరణలో... మూడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలు పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్మోహన్ రెడ్డి. సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి పులివెందుల చేరుకుంటారు . అక్కడే రాత్రికి బస చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రేపు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కడప జిల్లాలోని సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: