తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా గాని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం రోజు రోజుకి దిగజారి పోతుంది. 2014 ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఉన్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూనే ఉంది. అయినా కానీ కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ పదవి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ మాత్రం పక్కన పెట్టడం లేదు. ముఖ్యంగా పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు చాలామంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని బహిరంగంగానే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఇటీవల జగ్గారెడ్డి మరియు కోమటిరెడ్డి కూడా దయచేసి మాకు ముఖ్యమంత్రి పదవి వద్దు పిసిసి పీఠం ఇవ్వండి చాలు అని అధిష్టానానికి తమ బాధను చెప్పుకుంటున్నారు.

 

ఇదే పరిస్థితి ప్రస్తుతం వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని తెగ వాపోతున్నారట. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ పలు రాష్ట్రాలలో కొంతమందికి పదవీ బాధ్యతలు అప్ప చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తనకు ఎటువంటి ముఖ్యమంత్రి పోస్టు మంత్రుల పోస్ట్ వద్దని పీసీసీ పీఠం ఇస్తే చాలని.. నాలుగేళ్లలో ఊరువాడ తిరిగి కాంగ్రెస్ ను తెలంగాణలో గద్దెనెక్కిస్తానని శపథం చేశాడు. ఈ మేరకు సోనియా రాహుల్ ను కలవబోతున్నట్టు ప్రకటించారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల వెనుక తెలంగాణకు సీఎం అవ్వాలని పిసిసి పాట పాడుతూ ఆ దారిలో వైయస్ మాదిరిగా పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

 

ఒకవేళ రాహుల్ గాంధీ కనుక కోమటి రెడ్డి వెంకట రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇస్తే ఖచ్చితంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. పీసీసీ పదవి చేపట్టి పాదయాత్ర చేసి తెలంగాణ సీఎం అవ్వాలన్నది కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాటల యొక్క అంతర్యామిని వ్యాఖ్యానిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: