ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని నెరవేరుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ ఇప్పటికే చాలా మటుకు హామీలను నెరవేర్చారూ. ఇక తాజాగా ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీ కూడా నెరవేర్చి ప్రజల ముఖాల్లో ఆనందం చూసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ సర్కార్ సంకల్పించింది. దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఈ పథకం విషయంలో అధికారులు చూపుతున్న అత్యుత్సాహం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళినట్లు సమాచారం. అయితే ప్రజల వద్ద నుంచి బలవంతపు భూసేకరణ చేయవద్దని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం మాట పట్టించుకోకుండా అధికారులు మాత్రం అత్యుత్సాహంతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారని సమాచారం. బలవంతపు భూసేకరణ అంటే... మామూలుగా ఆ భూమికి పలుకుతున్న ధర కంటే చాలా తక్కువ రేటులో కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టుబట్టి తక్కువ కాంపన్సేషన్ కె భూములను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం
నేపథ్యంలో ప్రజలు కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ అవినీతి జరగకుండా పాలన సాగిస్తున్నారూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అధికారులు చూపుతున్న అత్యుత్సాహం వల్ల జగన్ సర్కార్ కు చెడ్డపేరు వస్తుంది. 60, 70 ఏళ్ల క్రితం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను మళ్లీ ప్రభుత్వమే లాక్కోవడం ఎంతో అన్యాయం అంటున్నారు ప్రజలు. అయితే గతంలో జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు వాస్తవ ధరకంటే ప్రభుత్వం ప్రకటించిన ధర ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం జగన్ సర్కార్ ప్రకటించిన ధర వాస్తవ ధర కంటే తక్కువగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విషయంపై ఎలా స్పందిస్తారు... బలవంతపు భూ సేకరణను నిలిపి వేస్తారా లేక కాంపెన్సేషన్ పెంచి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి