తెలంగాణలో కరోనా వణికిస్తోంది. గాంధీకి కరోనా అనుమానితులు క్యూ కడుతున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందిపై రకరకాల పోస్టులు, వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. వీటిని చూసి స్పందించిన ఓ కరోనా రోగి వీడియో ద్వారా స్పందించారు. గాంధీ వైద్యులు చేస్తున్న సేవల గురించి బాగా వివరించారు. ఆ వీడియోలో గాంధీలోని కరోనా వార్డులు ఎలా ఉన్నాయి. అక్కడి వైద్య సేవలు ఎలా ఉన్నాయో దృశ్య పరంగా వివరించారు.

 

 

తాను గాంధీలో చేరినప్పటి నుంచి తనను ఎలా ట్రీట్ చేస్తున్నారో ఆ రోగి చెప్పారు. ఆయన మాట్లలోనే విందాం..

నేను మొదట ఇక్కడ చేరినప్పుడు అసలు కరోనా లక్షణాలే లేవు. కానీ నాకు పాజిటివ్ వచ్చింది, అప్పటి నుంచి గాంధీలోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. కావాలంటే మీకూ చూపిస్తాను చూడండి.. చూడండి గదులు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో.. ఈ గదిలో ఇద్దరం కరోనా రోగులం ఉంటున్నాం..

 

 

ఒక విషయంలో ఇక్కడి వైద్య సిబ్బందిని మెచ్చుకోవాలి. ఇక్కడి వైద్యులు వాళ్లు పెళ్లాం పిల్లలను వదిలేసి సేవ చేస్తున్నారు.. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కూడా వారు వైద్యం అందిస్తునత్నారు. మా ఫ్రెండ్స్ కొందరు అమెరికన్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అక్కడ వాళ్లు ఎలా ఉందో చెబుతున్నది వింటే చాలా భయంకరంగా ఉంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఇంత చక్కగా సౌకర్యాలు లేవని వాళ్ల మాటలు వింటే అర్థమవుతోంది.

 

 

మీకో విషయం చెబితే నమ్ముతారో లేదో.. ఇక్కడి సౌకర్యాలపై మంత్రి ఈటెల రాజేందర్ గారు రెండు సార్లు నాకు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఒకటి రెండు సార్లు ఆకస్మికంగా వచ్చి మా సౌకర్యాలు పరిశీలించారు. ఇక్కడి వైద్య సేవలు చూస్తే ఆర్మీ తర్వాత వీళ్లే నిజమైన హీరోలు అనిపిస్తోంది. దయచేసి ఇక్కడి వైద్య సేవలపై తప్పుడు ప్రచారం చేయకండి అంటూ ఆ రోగి తన అనుభవాలు వివరించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: