లాక్ డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా మందుబాబులు మద్యం దొరకక పిచ్చోళ్లు అయిపోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో అయిన మందు అమ్మాలంటూ విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు మందు ఆన్‌లైన్లో అమ్మాలంటూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో  కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది.  మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

 

ఓ వైపు దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంటే.. ఈ సమయంలో మద్యం పై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని సూచించింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జయశంకర్‌ నంబియార్‌, శజ్జీ పీ చాలేతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దంటూ పినరయి విజయన్‌ ప్రభుత్వాన్ని కోరింది.  తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

 

నిజానికి కేరళలో మందులేక విత్ డ్రాళ్ లక్షణాలతో కొంతమంది బాధపడ్డారు. ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు కూడా. దీంతో వైద్యుల సూచన మేరకు మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయం తీసుకున్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: