తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైల్ కు పెట్టింది పేరుగా తెలుగు ప్రేక్షకులు స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు  సరికొత్త గెటప్ తో సరికొత్త హెయిర్ స్టైల్ తో అదిరిపోయే డాన్స్ లతో తెలుగు ప్రేక్షకులను అభిమానులను అలరిస్తున్నాడు . అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి అల్లు అర్జున్ డ్రెస్ డ్రెస్సింగ్ స్టైల్ వరకు ప్రతిది స్టైల్ కి  కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ప్రతి సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తూ  యూత్ ను  బాగా ఆకర్షిస్తుంటారు. ఏదైనా అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే చాలు యూత్ మొత్తం అల్లు అర్జున్ సినిమాలో వాడిన హెయిర్ స్టైల్ ఉపయోగిస్తూ ఉంటారు. అంతలా అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ యూత్ ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

 

 

 అయితే అల్లు అర్జున్ కి బాగా పేరు ఉండటంతో ఇప్పటివరకు ఏ సినిమాలో విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎలాంటి విగ్గు  లేకుండానే అదిరిపోయే హెయిర్ స్టైల్ చేస్తూ ఆకర్షిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. కెరీర్ తొలినాళ్లలో నుంచి గెటప్స్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేశాడు . అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఐదవ సినిమాలో  దేశముదురు లో సిక్స్ ప్యాక్ తో అందరిని ఆకర్శిస్తూ  అదిరిపోయే లాంగ్ హెయిర్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో  ప్రయోగాలు. ఇక నా పేరు సూర్య కోసం ఏకంగా మిల్ట్రీ హైర్ స్టైల్ ట్రై  చేసి.. ఎప్పుడు కూల్  గా  కనిపించే బన్నీ మిల్ట్రీ  వారిలాగా సీరియస్గా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. 

 

 

 ఆర్మి  అధికారి పాత్ర  కోసం బాడీ బిల్డింగ్  చేసి భారి  కాయం గా మారిపోయాడు. తన లుక్ కూడా పూర్తిగా మార్చేసాడు . ఇలా విభిన్నమైన ప్రయోగాల తోనే  ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠ పురములో సినిమా కూడా మరో సరికొత్త హెయిర్ స్టైల్ తో అభిమానులను అలరించాడు . అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఎంతగానో ఆకర్షించింది అల వైకుంఠ పురములో సినిమాలో . అయితే ఆదిత్య శ్రీరామ్  దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ  సినిమాలో విగ్  ధరించి పోతున్నాడట . ఐకాన్  సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న  అల్లు అర్జున్ మద్య వయస్కుడి  పాత్ర కోసం విగ్గు ధరించబోతున్నట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: