చాలా మంది భార్యా భ‌ర్త‌లు పిల్ల‌ల కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తారు.  అందులో మొద‌టి సంతానం పుట్ట‌గానే అది ఆడ‌పిల్లైన‌, మ‌గ‌పిల్లాడైనా ఎంతో ఆనంద‌ప‌డ‌తారు. ఇక ఇదిలా ఉంటే... చాలా మంది ఒక పిల్లాడు పుట్ట‌గానే సెక్స్ మీద పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు.  ఏదో ఒక కార‌ణంతో సెక్స్‌కి దూరంగా ఉంటుంటారు. కొంత మంది పిల్లాడిని చూసుకునే బాధ్య‌త‌తో పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. కొన్ని సార్లు ఈ స‌మస్య భార్యా భ‌ర్త‌లు విడిపోయేంత దూరం తీసుకెళ్ళిపోతుంది. అది ఇద్ద‌రికి కూడా అంత మంచిది కాదు. ఇక రెండో బిడ్డ పుట్టేస‌రికి అప్ప‌టికి వారికి బిడ్డను పెంచే అల‌వాటు అయిపోయి ఉంటుంది. ఇక ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను పెంచుకోవ‌డం అనేది వాళ్ళ‌ను ఎలా చూసుకోవాలి అన్న‌ది ఒక అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది. అలాగే ఇంకో పిల్ల‌ని క‌నే ఆలోచ‌న కూడా  ఉండ‌దు కాబట్టి ప్రేమానురాగాలు, ఆప్యాయ‌త‌లు పెరుగుతాయి.

 

భార్యాభ‌ర్త‌లు ఎప్పుడైనా స‌రే బాధ్య‌త‌లు ఎక్కువ‌గా ఉంటే...వారి మ‌ధ్య కాస్త దూరం అనేది కూడా పెరుగుతుంది. ప్రేమానురాగాలు కాస్త త‌గ్గుతాయి. ఎందుకంటే బాధ్య‌త‌ల‌తో ఎవ‌రి టెన్ష‌న్స్‌లో వారు ఉంటారు. దీంతో ఒక్కోసారి సంసారం చేసేంత స‌మ‌యం కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఇద్ద‌రూ బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఒక‌రి మీద ఒక‌రు చిరాకుప‌డుతూ ఉంటారు. కోపం పెరుగుతూ ఉంటుంది. దాంతో ఒక్కోసారి గొడ‌వ‌లు పీక్స్‌లోకి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే బాధ్య‌త‌లు త‌గ్గుతాయో అప్పుడే మ‌ళ్ళీ భార్యాభ‌ర్త‌లకు స‌మ‌యం దొరుకుతుంది ఆనందంగా లైఫ్‌ని గ‌డుపుతారు. ఇక పిల్ల‌లు చిన్న‌గా ఉన్న‌ప్పుడు వారిని పెంచే ప‌నిలో పడి అన్నీ బాధ్య‌త‌లే ఉంటాయి కాబ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య కాస్త అన్యోన్య‌త అన్న‌ది కాస్త త‌క్కువ‌గానే ఉంటుంది. ఈ రోజుల్లో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే కంటున్నారు కాబ‌ట్టి అందుకే రోండో బిడ్డ పుట్టిన త‌ర్వాత దాంపత్య జీవితంలో మార్పు వ‌స్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఇది ఇటీవ‌లె జ‌రిగిన మిచిగాన్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: