వన్యప్రాణుల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చిన అటవీ జంతువుల వేట మాత్రం ఆగడం లేదు. కాసుల కోసం కరెంటు షాక్ పెట్టి జంతువులను మట్టు పెడుతున్నారు వేటగాళ్లు. తాజాగా వరంగల్‌ రూరల్ జిల్లాలో చుక్కల దుప్పిని చంపిన నలుగురిని అరెస్ట్ చేశారు అధికారులు.

 

తెలంగాణ జిల్లాల్లో అటవీ జంతువుల వేట కొనసాగుతునే ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చుకోడానికి బయటకు వచ్చిన జంతువులకు ఉచ్చులు వేసి మట్టు పెడుతూనే ఉన్నారు. భూపాలపల్లి, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పొలాల వ్దద కరెంటు తీగలు పెట్టి జంతువులను వేటాడుతున్నారు. దుప్పి, జింకల మాంసానికి డిమాండ్ ఉండడంతో చాలా మంది వాటిని వేటాడుతున్నారు. వారం క్రితం ములుగు జిల్లా వెంకటపూర్‌లో దుప్పి మాంసం అమ్ముతున్న నలుగురిని పట్టుకొని కేసు పెట్టిన సంఘటన మారువకముందే..ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరులో దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

 

చిలకమ్మ నగర్‌లో అరుదైన చుక్కల దుప్పికి కరెంటు షాక్ పెట్టి మట్టు పెట్టిన వేటగాళ్లు కొత్తూరులో మాంసం ని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.  పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దుప్పి మాంసం, చర్మంతో పాటు కొమ్ములను స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అంతే కాదు దుప్పి మాంసం కొనేందుకు వచ్చిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

 

జింకను మట్టుపెట్టిన వారిపై జంతువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. జింక వేటలో ఎవరెవరి ప్రమేయం ఉందని అరా తీస్తున్నారు. ఇకపై అటవీ జంతువుల సంరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతామంటున్నారు అధికారులు. అడవి జంతువులను చంపడం నేరం అని అటవీ శాఖ అధికారులు ఎంత మొత్తుకుంటున్నా వేటగాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. దుప్పులు, జింకలు, పులులను చంపి వాటితో వ్యాపారం చేసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: