ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ప్రపంచ దేశాలకు తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా నియంత పాలన కు కేరాఫ్ అడ్రస్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అన్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు అన్నీ తానై  పాలన సాగిస్తూ ఉంటాడు. ఎవరైనా ఎదురు చెప్తే ప్రాణాలు తీయడమే  తరువాయి.. అధ్యక్షుడు కిమ్  చెప్పింది అందరూ ఫాలో అవుతూ ఉంటారు. తప్పు  చేసినప్పటికీ కూడా తప్పు ను ఒప్పు   అని చెప్పుకోవడం తప్ప ఎక్కడ క్షమాపణలు చెప్పే టైప్ కాదు కిమ్. కానీ  మొదటిసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఇదే అంతర్జాతీయ మీడియాలో  హాట్ టాపిక్ గా మారిపోయింది.




 ఇంతకీ నియంతగా వ్యవహరించే కిమ్  ప్రస్తుతం మొదటి సారి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే అనుమానం రావచ్చు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియా ఉత్తర కొరియా ల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక అధికారి చేపల వేటకు వెళ్లి నటువంటి సందర్భంలో.. ఆకస్మాత్తుగా  అదృశ్యమయ్యాడు. ఒకరోజు తర్వాత ఆయన శవం బూడిద కనిపించింది. దీనిని సీరియస్ గా తీసుకున్న  దక్షిణ కొరియా ప్రభుత్వం దీనిపై విచారణ జరిపితే.. ఇది  ఉత్తర కొరియా సైనికుల పనే  అన్న నిజం బయటపడింది.




 ఉత్తర కొరియా కి సంబంధించిన నలుగురు సైనికులు దక్షిణ కొరియా అధికారిని పట్టుకొని నిర్బంధించి చివరికి ఇలా ప్రాణాలు తీసి కాల్చేసినట్లు విచారణలో తేలింది. కాగా దీనిపై దక్షిణకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మొదటి సారి ఆయన జీవితంలో క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయిందని ఇది తమ దేశానికి చెందిన సైనికులే  చేశారని   ఇది ఎందుకు జరిగింది అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని.. ఈ ఘటనపై దక్షిణ కొరియాకి క్షమాపణలు చెబుతున్నా అంటూ కిమ్  స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా కిమ్ క్షమాపణ చెప్పడం సంచలనంగా మారగా..  దీనిపై దక్షిణ కొరియా ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: