తెలంగాణ ప్రజలందరిని భారీ వర్షాలు వీడటం లేదు కష్టాలు తప్పడం లేదు. వరుసగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ప్రజానీకం మొత్తం అతలాకుతలం అయిపోతున్న విషయం తెలిసిందే . భారీ వర్షాలతో వరదలు వచ్చి జనజీవనం స్తంభించి పోతుంది. కేవలం నగరాలలో మాత్రమే కాదు పట్టణాలు గ్రామాలలో సైతం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో భారీ వర్షాలతో జనం మొత్తం అల్లాడిపోతున్నారు. కొంతమంది వరద నీటి లో చిక్కుకొని తిండి నిద్ర లేకుండా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు ఘటనలు మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరదల్లో చిక్కుకుపోయిన వారికి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.


 వరదల్లో చిక్కుకుపోయిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది . భారీ వర్షాల కారణంగా వరదలు ఎక్కువగా వచ్చి జనావాసాల్లోకి నీరు వచ్చి ప్రస్తుతం మురికి నీరు నిండి పోయి కనీసం తినడానికి తిండి లేక పడుకోవడానికి నిద్రలేక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ప్రజానీకాన్ని ఆదుకోవడానికి అటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వరద బాధితులు ఇంటివద్దకే సీఎం రిలీఫ్ కిట్ లను అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.



 సీఎం రిలీఫ్ ఫండ్ కిట్లను వరద బాధితుల కుటుంబాల ఇళ్ల వద్దకు అందచేయాలి స్పష్టం చేశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రెండు వేల ఎనిమిది వందల రూపాయల విలువైన ఈ సీఎం రిలీఫ్ ఇట్లు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు మూడు బ్లాంకెట్ లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు, అరకేజీ వంటనూనె, కారంపొడి - 200 gm,పసుపు - 100 gm, ఉప్పు - 1kg, చింతపండు - 250 gm, గోధుమ పిండి - 1kg, చాయ్ పత్తి - 100 gm, చక్కెర - 500 gm పాటు వరద బాధితులకు దుప్పటి కూడా అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: