చైనా వాళ్ళు చేసిన పాపానికి ప్రస్తుత ప్రపంచ దేశాలు మొత్తం బలవుతున్న విషయం తెలిసిందే. చైనాలో తగిన మహమ్మారి కరోనా  వైరస్ ప్రపంచదేశాలను మాత్రం ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. కరోనా వైరస్ పంజా విసిరి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు మనుషుల మధ్య మానవ సంబంధాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎంతో మంది తమ ప్రియమైన వారు చనిపోయినప్పటికీ చివరికి కడచూపుకు  కూడా నోచుకోలేని దుస్థితి కరోనా వైరస్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ బారిన పడిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఆరోగ్య కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉండటంతో.. కనీసం కడచూపు కూడా దక్కడం లేదు ఎన్నో కుటుంబాలకి.



 కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న   నేపథ్యంలో ఇలాంటి  హృదయవిదారక ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం దృశ్య కడ  చూపు కూడా నోచుకోని ఎన్నో కుటుంబాలు తీవ్ర శోకసముద్రంలో మునిగి పోయిన విషయం తెలిసిందే. ఇక్కడ ఒక జపాన్ కి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాను కడచూపుకు  కూడా నోచుకోలేదు ఆ జవాన్ కుటుంబం. దీనికంతటికీ కారణం కరోనా వైరస్. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.



 సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు తెలంగాణకు చెందిన షాకీర్ హుస్సేన్ అనే జవాన్. అయితే సదరు జవాన్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపబోము అంటూ  అధికారులు స్పష్టం చేయడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన షాకీర్ హుస్సేన్ 19 ఏళ్లుగా లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన కొండచరియలు విరిగిపడి జవాన్  మృతి చెందాడు. జవాన్ బౌతికఖాయానికి కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.. ఈ క్రమంలోనే జవాన్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించలేదని శ్రీనగర్లోనే  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ఆర్మీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: