హైదరాబాద్ లో భారీ వర్షాల దెబ్బకు నానా ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. తినడానికి తిండి  లేక కూడా చాలా మంది ఇబ్బందులు  పడే పరిస్థితి ఏర్పడింది అనే మాట వాస్తవం. ఇక హైదరాబాద్ లో పాత భవనాలు, అక్రమ నిర్మాణాలతో ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడింది అనే మాట వాస్తవం. ఇక ఇదిలా ఉంటే  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ క‌మిష‌న‌ర్ కీలక వ్యాఖ్యలు చేసారు.  గ‌త వారం రోజుల‌లో 65 శిథిల భ‌వ‌నాల కూల్చివేత‌ జరిగింది అని ఆయన చెప్పారు. వ‌ర్షాలు ప‌డుతున్నందున శిథిల భ‌వ‌నాలు ఖాళీ  చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసారు క‌మిష‌న‌ర్‌.

న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నందున ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుట‌కు స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి శిథిల భ‌వ‌నాల కూల్చివేత‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరించారు. శిథిల భ‌వ‌నాల కూల్చివేతకు సంబంధించి ఇటీవ‌ల జిహెచ్ఎంసి కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో  రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె. తార‌క‌ రామారావు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ఆయన మీడియాకు తెలిపారు. త‌ద‌నుగుణంగా ఇటీవ‌ల ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలు కురుస్తున్నందున ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుట‌కు టౌన్‌ ప్లానింగ్ విభాగం అధికారులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు  ఆయన మీడియాకు వివరించారు.

తెలిపారు. గ‌త వారం రోజుల‌లో 65  శిథిల భ‌వ‌నాల‌ను కూల్చివేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌మాద‌క‌రంగా ఉన్న శిథిల భవ‌నాల‌లో ఉంటున్న ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. వ‌ర్షాలు ప‌డుతున్నందున శిథిల భ‌వ‌నాలు ఖాళీ చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు క‌మిష‌న‌ర్‌ స్పష్టంగా చెప్పారు. ఇక ఇదిలా ఉంటే అక్రమ  కట్టడాల విషయంలో కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో తెలంగాణా సర్కార్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తెలంగాణా సర్కార్ తరలించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: