భారత్ విషయంలో ఏకంగా విషమే కక్కుతున్నారు ట్రంప్. ఆయన్ని పిలిచి మర్యాద చేసిన భారత గడ్డ ఈ రోజు ఆయనకు మురికిగా కనిపించిందంటే అది ఆయన అసహనం అహంభావం అనుకోవాలి. నాలుగేళ్ల క్రిత్రం ఒక వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ ని అక్కడి జనం గెలిపించి అమెరికా అధ్యక్షుడిగా  శ్వేత సౌధంలో ఉంచారు. మరో సారి కూడా తానే కొనసాగాలని ట్రంప్ కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆయన వాచాలత్వమే ఆయన స్థాయిని తగ్గిస్తోంది అంటున్నారు. నోరు దురుసుతో ఎంత మాట పడితే అంత మాట అంటున్న ట్రంప్ దాని వల్ల వచ్చే వ్యతిరేకతతో తన విజయావకాశాలను పూర్తిగా కోల్పోతున్నానని ఊహించలేకపోతున్నారు.

ఇక ట్రంప్ కి బలమైన ప్రత్యర్ధిగా అవతరించి హడలెత్తిస్తున్న జో బైడెన్ ట్రంప్ తాజా వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. భారత్ ని మురికిదేశం అని అనడం చాలా తప్పు అంటూ ఆయన ఖండించారు. భారర్ అమెరికా రెండూ సహజ మిత్రులని కూడా బైడెన్ అన్నారు. ఎవరైనా మిత్రులను అలా దూషిస్తారా అంటూ ఆయన ట్రంప్ వ్యవహార శైలిని తూర్పారా పట్టారు. భారత్ తో అమెరికా సంబంధాలు ఎప్పటి మాదిరిగానే తాము కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.


తనతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలుగా పోటీ చేస్తున్న కమలా హరీస్ కూడా భారత్ కి కొండంత అండగా ఉంటామని బైడెన్ ప్రకటించడం నిజంగా మంచి పరిణామం. ఇప్పటికే ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ కి మద్దతు బాగా ఉంది. తాజాగా దానిని ఆయన మరింతగా పెంచుకున్నారు. ఇక సర్వేలు అన్నీ కూడా బైడెన్ గెలుపు ఖాయమని కూడా చెబుతున్నాయి. మొత్తానికి ట్రంప్ పట్ల ఆ మాత్రం ఈ మాత్రం ప్రేమ అభిమానాలు ఉన్న వారు సైతం ఈసారి ఆయన రావడం కష్టమేనని అనేస్తున్నారు అంటే అదంతా ట్రంప్ చేసుకున్నదేనని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: