మొన్నటివరకు తెలంగాణ రాష్ట్రాన్ని వరుసగా కురిసిన వర్షాలు వణికించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. ఓవైపు కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రకృతితో కూడా పోరాటం చేసారు తెలంగాణ ప్రజానీకం. ఇక ఇప్పుడు తెలంగాణలో రోజురోజుకీ చలి తీవ్రత కూడా క్రమక్రమంగా పెరిగి పోతుండటంతో తెలంగాణ ప్రజానీకానికి మొత్తం భయం పట్టుకుంది. ఎందుకంటే చలికాలంలోకరోనా  వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో  ప్రస్తుతం తెలంగాణ ప్రజానీకం మొత్తం వణికిపోతుంది.



 తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి  తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలందరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లోనే కాదు ఉదయం సమయంలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. కనీసం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కనిపించని విధంగా పొగమంచు కప్పేస్తుంది.



 అయితే నవంబర్ 1వ తేదీ నుంచి చలి తీవ్రత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజలందరూ చలి తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అటు కరోనా వైరస్ వ్యాప్తి కూడా చాలా వేగంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు... తెలంగాణ ప్రజానీకం లో మరింత భయం పట్టుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కరోనా  కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు తెలంగాణ ప్రజానీకం. ఇప్పుడు మళ్ళీ కేసులు పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ ప్రజానీకం మొత్తం వణికిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: