మొదటగా భర్వాన్ గోబీ ఎలా తయారుచేయాలో చూద్దాం..భర్వన్ గోభి తయారీకి కాలీఫ్లవర్, చీజ్, కిస్మిస్, దానిమ్మ గింజలు, పచ్చి కోవా, సెనగపిండి వేయించే ఈ వంటకం చాలా ఫేమస్ డిష్. వింటర్ స్పెషల్స్ లో ముందు చెప్పుకోవాల్సింది దీన్నే. తరువాత బాగా ఫేమస్ అయిన వంట మూలీ కోఫ్తా. ఈ డిష్ ని ముల్లంగి, కొబ్బరి, వేరుసనగగుళ్ళు, శనగపిండి, గరం మసాలా, ఎండు మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చితో కలిపి చేస్తారు.ట్రై చేసి ఎంజాయ్ చేయండి మరి. అలాగే ఇంకొక పాపులర్ వంట చిలగడ దుంప రబ్డీ.
చిలగడ దుంపలో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సీ, మెగ్నీషియం, కాల్షియం వంటివి చాలా ఉంటాయి.వీటిలో పాలూ, కుంకుమ పువ్వు, చిలగడ దుంప కలిపి చేసే ఈ రబ్డీ పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు.అలాగే బీట్రూట్ కబాబ్ కూడా మంచి రుచికరమైన వంటకం. ఈ బీట్రూట్, తోఫూ కబాబ్స్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయి. పైగా ఇందులో అసలు క్యాలరీలే ఉండవు. ఇందులో కలిపే జీడిపప్పు, ఓట్స్ వల్ల ఈ కబాబ్స్ ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఎంతో హెల్దీ కూడా. అలాగే ఆకుకూరలతో చేసే పాలకూర షోర్బా మంచి రుచితో కూడిన వంటకం.
ఈ పాలకూర షోర్బా సూప్ కంటే కూడా కొద్దిగా పల్చగా ఉంటుంది. వెచ్చగా, పొట్టలో ప్రశాంతంగా ఉండే ఈ డిష్ లో పప్పు, పాలకూర, అల్లం, వెల్లుల్లి, తేలికపాటి మసాలాలు ఉంటాయి. కొద్దిగా ఫ్రెష్ క్రీం, కొంచెం నిమ్మరసం తో గార్నిష్ చేస్తే ఆ రుచి అద్భుతం. అలాగే ఈ సీజనల్ ఆహారపదర్ధాలు తినడం వల్ల మీకు కావాల్సిన న్యూట్రియెంట్స్ ని అందిస్తాయి. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి కొనక్కరలేదు. అంతేకాకుండా సీజన్ లో దొరికే ఫుడ్స్ రుచిగా కూడా ఉంటాయి..అలాగే తాజా వెజిటబుల్స్ దొరుకుతాయి.ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యకరం.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి