
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ముంబై లో చోటు చేసుకుంది ఈ ఘటన. ముంబైకి చెందిన తేజస్ రుచిత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కాలేజీలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి... ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలి అని నిర్ణయించుకున్నారు. తేజజ్ పూర్తిగా మద్యానికి బానిసగా మారడంతో రుచిత తన నిర్ణయం మార్చుకున్నది . ఇక అప్పటి నుంచి రుచిత తేజస్ ను దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలై గొడవలు జరుగుతూ ఉండేవి.
మద్యం మానేయాలని రుచిత ఎన్నిసార్లు సూచించినప్పటికీ తేజస్ లో మాత్రం మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన రుచిత ... అతడి నుంచి బంధాన్ని పూర్తిగా పెంచుకునేందుకు సిద్ధమైంది. ఇక తేజస్ ను దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు తేజస్ . తనతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైన ప్రియురాలిని దారుణంగా హత్య చేయాలని అనుకున్నాడు. ఇటీవలే మాయమాటలు చెప్పి ఓ ప్రదేశానికి తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆమెపై దాడి చేశాడు. ఏకంగా తప్పించుకొని పరిగెత్తుతున్న రుచిత పై వెంటాడి మరీ కత్తి పోట్లు పొడిచాడు. చివరికి ప్రాణాలు వదిలింది రుచిత. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.