పగవాడికి కూడా ఈ కష్టం వద్దు రా అనుకుంటూ ... టిఆర్ఎస్ నాయకులు తెగ బాధపడిపోతున్నారు. గ్రేటర్ లో వేలాది కోట్లు సొమ్ములు కుమ్మరించి అభివృద్ధి పనులు చేపట్టినా, వరదల కారణంగా, ఒక్క దెబ్బకు కొట్టుకుపోయాయి. ఇప్పుడు చూస్తే ఆకస్మాత్తుగా గ్రేటర్ ఎన్నికలు ముంచుకు వచ్చాయి అని,  ఈ సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడుగుదామంటే , చేసిన అభివృద్ధి మొత్తం వరద రూపంలో కొట్టుకుపోవడంతో,  ఇప్పుడు ప్రజలకు మొహం  చూపించలేని పరిస్థితి ఏర్పడిందని టిఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లలో టిఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. మళ్లీ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. 2016 లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ , ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో స్థానాలను దక్కించుకుని , రాజకీయ ప్రత్యర్ధులకు సవాల్ విసరాలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 



బిజెపి సైతం అంతే స్థాయిలో టిఆర్ఎస్ కు అవకాశం దక్కకుండా చేసేందుకు, గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఇటీవల సంభవించిన వరద భయం ఎక్కువగా కనిపిస్తోంది. వరదలు గ్రేటర్ లోని జనజీవనాన్ని అతలాకుతలం చేయడంతో పాటు,  భారీ ఆస్తి ,ప్రాణ నష్టాన్ని కలిగించాయి.దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతూ , అభివృద్ధిపై నిలదీస్తూ వరద సహాయం పైన హడావిడి చేస్తుడడంతో,  టిఆర్ఎస్ తలపట్టుకుంది.ఇప్పటికే పెద్ద ఎత్తున వరద సహాయాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇంకా కొంత మందికి మిగిలారు. వారికి అందించే సమయానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, ఈ మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. 



అయినా ప్రభుత్వం మాత్రం తాము వరద సహాయక చర్యల్లో సమర్థవంతంగా పని చేసామని, నష్టపోయిన వారికి పదివేల ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ అందించామని, మరికొంతమందికి తర్వాత అందిస్తామని చెబుతున్నా, జనాగ్రహం పెరుగుతున్నట్లుగా కనిపిస్తుండటంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన వారి మద్దతు తీసుకోవడంతో పాటు, అవసరమైతే రంగంలోకి దించాలని చూస్తోంది. అంటే , వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తమను గట్టేక్కిస్తారో లేక ఇంటికి సాగనంపుతారో అనే టెన్షన్ అధికార పార్టీలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: