ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్లో పరిణామాలు రోజురోజుకీ శరవేగంగా మారిపోతూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి. అదే సమయంలో విదేశీ కంపెనీలను ఆకర్షించి వివిధ బహుళజాతి కంపెనీలను తమ రాష్ట్రానికి తీసుకురావడంలో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయవంతం అవుతున్నారు.



 అంతే కాదు పాలన విషయంలో కూడా  ఎంతో మెరుగైన పాలన చేస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా అయితే రాజకీయ నాయకుడికి మొహమాటం ఉండకూడదు లేదా మొండితనం ఉండాలి అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు.   యోగి ఆదిత్యనాథ్ కు ఈ రెండు పుష్టిగా ఉన్నాయి. అందుకే ఏ  నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేస్తూ ఉంటారు యోగి ఆదిత్యనాథ్. ఇటీవలే మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.. హిందువులను గర్వపడేలా చేశారూ  యోగి ఆదిత్యనాథ్




 ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా  మారిపోయింది. ఇప్పటి వరకు  ఎయిర్ పోర్టు లకు దేవుళ్ళ పేరు పెట్టడానికి భయపడిపోయారు కానీ యోగి ఆదిత్యనాథ్ అది చేసి చూపించారు. ప్రస్తుతం అయోధ్య ఎయిర్ పోర్ట్ కి.. మర్యాద పురుషోత్తమ్  శ్రీరామ ఎయిర్పోర్ట్ అనే సరికొత్త పేరు పెట్టారు. అంటే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ విమానాలు తిరిగిన ప్రతి సారి కూడా ఎయిర్పోర్టు యొక్క పేరును చదువుతూ ఉంటారు. కాబట్టి శ్రీరాముడి గొప్పదనాన్ని అందరూ మాట్లాడుకునే  విధంగా ఈ  పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: