ఎప్పుడు ఏ పార్టీ నెగ్గుతుందో ఎవరికీ తెలుసు.. ప్రజలు ఏ పార్టీ ఎప్పుడు నమ్ముతారో ఎవరికీ తేలీదు.. అందుకు ఉదాహరణ ఏపీ లో టీడీపీ పార్టీ ఓటమి, దుబ్బాక లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓటమి.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ని ఎలాంటి బలం లేని పార్టీ ఓడించిందంటే వారు ఎంత గా ప్రజల్లో నమ్మకం సాధించారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీ పార్టీ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్ళిందో కూడా అర్థం చేసుకోవచ్చు.. ఎంత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కి తెలంగాణ లో అస్సలు బలం లేని స్థాయి నుంచి నాలుగు ఏమీ సీట్లు, రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే స్థాయికి వచ్చిందంటే బీజేపీ ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు.  

ఇప్పుడు గ్రేటర్ లోనూ విజయం సాధించాలని తెగ ఆరాటపడుతుంది బీజేపీ పార్టీ.. ఈ ప్రచారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ వంటి హేమా హేమీలు పాల్గొని బీజేపీ పార్టీ కి హైదరాబాద్ లో వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రజలకు మేనిఫెస్టో రూపంలో వరాలు కురిపిస్తున్నారు.. తాజాగా ఈ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో లో ఓ పథకం జగన్ ఏపీ లో ప్రవేశ పెట్టిన పథకం ను పోలి ఉంది.  బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది.

ఆటోల రిపేర్లు ఇతర అవసరాల కోసం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.7000 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రమాదబీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ పథకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది.  అటుఇటు గా ఆ పథకాన్ని పోలి ఉండడంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని చర్చ చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల కాగా డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: